Vajra Farms Eluru

Vajra Farms Eluru Vajra Farms Eluru

*వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు పార్లమెంట్ ఇంచార్జ్ శ్రీ కారుమూరి సునీల్ కుమార్ గారి పర్యటన వివరాలు*రాష్ట్రంలో *మొక్కజొ...
17/05/2026

*వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు పార్లమెంట్ ఇంచార్జ్ శ్రీ కారుమూరి సునీల్ కుమార్ గారి పర్యటన వివరాలు*

రాష్ట్రంలో *మొక్కజొన్న - మామిడి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, పంటలకు గిట్టుబాటు ధరలు, రైతుల ప్రస్తుత పరిస్థితులపై సమగ్రంగా చర్చించేందుకు* ఈ రోజు అనగా *ఆదివారం నూజివీడు నియోజకవర్గంలో రైతుల సమావేశ* కార్యక్రమం నిర్వహించబడనుంది.

ఈ కార్యక్రమానికి *మాజీ ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ మేక వెంకట ప్రతాప్ అప్పారావు గారితో కలిసి కారుమూరి సునీల్ కుమార్ గారు* వేదికను పంచుకోనున్నారు.

*రైతు సంక్షేమం మరియు వారి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా* నిర్వహిస్తున్న ఈ సమావేశానికి *రైతు సోదరులు,పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం* చేయవలసిందిగా మనవి.

*📅 తేదీ: 17-05-2026 (ఆదివారం)*
*🕑 సమయం: మధ్యాహ్నం 2:00 గంటలకు*
*📍 వేదిక: కృష్ణ విలాస్ కళ్యాణ మండపం, రాజీవ్ సర్కిల్ సమీపంలో, నూజివీడు.*

*వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం*
*ఏలూరు పార్లమెంట్*

14/05/2026

ఈ రోజు తాడేపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి YS Jagan Mohan Reddy గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, పార్టీ కార్యక్రమాలు, పార్టీ బలోపేతం తదితర అంశాలపై చర్చించడం జరిగింది. అలాగే పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసే దిశగా సాగాలని జగన్ గారు సూచించారు.





Tadepalli, May 13: Former Chief Minister and YSRCP President Shri. YS Jagan Mohan Reddy spoke to Tamil Nadu Chief Minist...
13/05/2026

Tadepalli, May 13: Former Chief Minister and YSRCP President Shri. YS Jagan Mohan Reddy spoke to Tamil Nadu Chief Minister Thiru. C Joseph Vijay and congratulated him on his party’s victory in the elections and wished him on assuming office as the Chief Minister of Tamil Nadu. YS Jagan conveyed his best wishes for a successful tenure and expressed hope that Thiru. Vijay would provide good governance and work for the welfare and development of the people of Tamil Nadu. He wished him strength and success in fulfilling the aspirations of the people and leading the state on the path of progress and inclusive administration.

తమిళనాడు ముఖ్యమంత్రి శ్రీ విజయ్‌గారికి శుభాకాంక్షలు తెలిపిన శ్రీ వైయస్‌ జగన్‌ గారు

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత శ్రీ వైయస్‌ జగన్‌ తమిళనాడు నూతన ముఖ్యమంత్రి శ్రీ విజయ్‌కు ఫోన్‌ చేసి శుభాకాంక్షలు తెలిపారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ ఘన విజయం సాధించి, ముఖ్యమంత్రిగా శ్రీ విజయ్‌ పదవీ బాధ్యతలు స్వీకరించిన నేపధ్యంలో ఆయన అభినందనలు తెలియజేశారు.

తమిళనాడు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా శ్రీ విజయ్‌ సమర్థవంతమైన, పారదర్శకమైన ప్రజాపాలన అందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం అంకితభావంతో పనిచేయాలని ఆకాంక్షించారు.

తమిళనాడు ప్రజలు శ్రీ విజయ్‌ నాయకత్వంపై ఎంతో విశ్వాసం ఉంచారని పేర్కొన్న ఆయన, ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ ప్రజల ఆశయాలను నెరవేర్చాలని కోరుకున్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి, సమగ్ర పాలన, ప్రజా సంక్షేమం దిశగా ముందుకు నడిపించాలని ఆకాంక్షించారు.

అలాగే శ్రీ విజయ్‌ నాయకత్వంలో తమిళనాడు దేశ అభివృద్ధిలో మరింత కీలక పాత్ర పోషించాలని, భారత సమగ్ర ప్రగతికి బలమైన భాగస్వామిగా నిలవాలని శ్రీ వైయస్‌ జగన్‌ ఆకాంక్షించారు.

13/05/2026

Address

Vellamilli Ramalayam Veedhi Unguturu Andrapradesh
Eluru
534411

Website

Alerts

Be the first to know and let us send you an email when Vajra Farms Eluru posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category