19/06/2026
*ప్రెస్ మీట్ లో మాట్లాడిన సీనియర్ నాయకులు కొంగ సత్యనారాయణ*
కాగజ్‌నగర్, జూన్ 18: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేతలపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కొంగ సత్యనారాయణ అన్నారు.
కాగజ్‌నగర్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాజకీయాల్లో విమర్శలు విధానాలు, ప్రజా సమస్యలపై ఉండాలని, వ్యక్తిగతంగా అవమానించేలా మాట్లాడడం సరైన పద్ధతి కాదన్నారు. “గుండు, అరగుండు” వంటి పదజాలంతో రాజకీయ ప్రత్యర్థులను సంబోధించడం ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న నాయకుడికి తగదని విమర్శించారు.
ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రభుత్వం దృష్టి సారించాలని, వ్యక్తిగత విమర్శలతో రాజకీయ వాతావరణాన్ని దిగజార్చవద్దని సూచించారు. రాజకీయ నాయకులు పరస్పర గౌరవంతో వ్యవహరిస్తే ప్రజలకు మంచి సందేశం వెళ్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో BRS పార్టీ సీనియర్ నాయకులు తెలంగాణ ఉద్యమకారులు గోలెం వెంకటేశం, వంజరి సర్పంచ్ గోపాల్, కాగజ్‌నగర్ మండల అధ్యక్షులు పార్వతి అంజన్న, హనుమంతు వాసాకే,మాజీ కౌన్సిలర్ నక్క.మనోహర్ శ్రీనివాస్, తాండ్ర నవీన్, సిర్పూర్ మహిళా నియోజకవర్గ కో-కన్వీనర్ కమల, టౌన్ మహిళా కన్వీనర్ తాండ్ర వరలక్ష్మి తదితరులు