10/10/2020
ప్రపంచ క్యాన్సర్ నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకొని గ్రేస్ క్యాన్సర్ రాన్ ను ఈ రోజు అనగా 10.10.2020 వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ శ్రీ కె నారాయణ్ నాయక్ ఐపీఎస్ వారు ఏలూరు పోలీస్ ప్రధాన కార్యాలయం వద్ద గల పోలీస్ పరేడ్ గ్రౌండ్ నందు నుండి పోలీస్ అధికారులతో జిల్లా ఎస్పీ గారు జెండా ఊపి గ్రేస్ క్యాన్సర్ రన్ ర్యాలీని ప్రారంభించినారు. ఈ ర్యాలీ పోలీస్ ప్రధాన కార్యాలయం వద్ద గల పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నుండి బయలుదేరి కలెక్టరేట్ జెడ్పి ఆఫీస్ ఫైర్ స్టేషన్ సెంటర్ మరియు ఏలూరు ప్రధాన వీధుల గుండా ర్యాలీని చేస్తూ ప్రజలలో క్యాన్సర్ వ్యాధి నిర్మూలన కొరకు ప్రజలు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి క్యాన్సర్ కారకముమైనటువంటి వ్యాధులు ఐదు రకాలుగా ఉన్నాయని, బ్లడ్ క్యాన్సర్ లంగ్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్ మెదడు సంబంధిత మైనటువంటి క్యాన్సర్లు, శరీరభాగాల్లో కణితులు ఏర్పడటం వలన క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు, సదరు క్యాన్సర్ నుండి ప్రజలు రక్షించుకునే నిమిత్తము గా ప్రతి ఒక్కరూ మద్యపానం సేవించడం చేయరాదు అని, పొగాకు సంబంధిత ఉత్పత్తులను తినడం గాని నమలడం గాని చేయరాదని, పౌష్టికాహారం తీసుకుంటూ తగిన సమయంలో వ్యాయామం ఆచరించటం వలన క్యాన్సర్ ను నిర్మూలన చేయ వచ్చునని అవగాహన కల్పిస్తూ ప్లే కార్డు ల ద్వారా అవగాహన కల్పించి తిరిగి పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నందు సదరు ర్యాలీని ముగించినారు, అనంతరం పోలీస్ ప్రధాన కార్యాలయం నందు గల సమావేశ మందిరంలో క్యాన్సర్ నిర్మూలన కొరకు సిబ్బందికి అవగాహన కల్పించే నిమిత్తంగా జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దృశ్యాలను ప్రదర్శించి క్యాన్సర్ నిర్మూలన ఏ విధంగా చేయాలి అనే అంశాలపై సిబ్బందికి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ ఎం మహేష్ కుమార్, ఏ ఆర్, డి ఎస్ పి కృష్ణంరాజు, అర్ ఐ లు ఎం మనోహరం మరియు కృష్ణంరాజు, అర్.ఎస్. ఐ లు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.