18/07/2026
🌾 రైతన్న మిల్క్ డెయిరీలో మరో స్ఫూర్తిదాయక సందర్శన 🌾
పల్నాడు జిల్లా, చిలకలూరిపేట సమీపంలోని విరాజ్ ఫార్మ్స్ నుండి విచ్చేసిన శ్రీమతి నాగమల్లి రాజేష్ గారికి రైతన్న మిల్క్ డెయిరీ తరఫున హృదయపూర్వక స్వాగతం.
అమెరికాలో సాఫ్ట్‌వేర్ లో పనిచేసినా శ్రీమతి నాగమల్లి రాజేష్ గారు, వ్యవసాయం మరియు పాడి పరిశ్రమలో అపారమైన అవకాశాలు ఉన్నాయని గుర్తించి, విలువ ఆధారిత పాల ఉత్పత్తుల తయారీ, ప్రాసెసింగ్, నాణ్యత ప్రమాణాలు, బ్రాండింగ్ మరియు మార్కెటింగ్ విధానాలను నేర్చుకోవడానికి రైతన్న మిల్క్ డెయిరీని సందర్శించారు.
వ్యవసాయం కేవలం ఒక వృత్తి మాత్రమే కాదు; ఉపాధిని సృష్టించే, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే గొప్ప పారిశ్రామిక రంగం. విదేశాల్లో, ఉన్నత ఉద్యోగాల్లో పనిచేసిన వారు కూడా వ్యవసాయ రంగాన్ని ఆశాజనకమైన భవిష్యత్తుగా ఎంచుకోవడం నేటి యువతకు స్ఫూర్తిదాయకం.
రైతన్న మిల్క్ డెయిరీ ఎలాంటి ఫీజు లేకుండా రైతులు, యువత, మహిళలకు విలువ ఆధారిత పాల ఉత్పత్తుల తయారీపై శిక్షణ అందిస్తూ, గ్రామీణ పారిశ్రామికవేత్తలను తయారు చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది.
"వ్యవసాయం మన మూలం... విలువ ఆధారిత ఉత్పత్తులు మన భవిష్యత్తు... రైతే దేశానికి నిజమైన బలం." 🌱🥛