12/06/2026
రాంపురంలో ఘనంగా విశాఖ డెయిరీ రూరల్ మిల్క్ పార్లర్ & డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ప్రారంభం 🪷
సబ్బవరం యూనిట్, పెందుర్తి బి.సి.సి పరిధిలోని రాంపురం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన విశాఖ డెయిరీ రూరల్ మిల్క్ పార్లర్ & డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను ఆంధ్ర రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షులు, విశాఖ డెయిరీ చైర్మన్ శ్రీ ఆడారి ఆనంద్ కుమార్ గారు ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా చైర్మన్ గారు మాట్లాడుతూ, రైతుల అభ్యున్నతి మరియు వినియోగదారులకు నాణ్యమైన పాల ఉత్పత్తులను మరింత చేరువ చేయడమే విశాఖ డెయిరీ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రతి గ్రామంలో, ప్రతి కిరాణా మరియు పాన్ షాపులో విశాఖ డెయిరీ ఉత్పత్తులు అందుబాటులోకి తీసుకురావడానికి రూరల్ మిల్క్ పార్లర్లు, డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను విస్తృతంగా ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు.
రైతులు, వినియోగదారులు, వ్యాపారుల సహకారంతో విశాఖ డెయిరీ మరింత అభివృద్ధి సాధిస్తూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు బలమైన తోడ్పాటును అందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
🌾🥛 రైతు సంక్షేమం – వినియోగదారుల విశ్వాసం – విశాఖ డెయిరీ లక్ష్యం 🥛🌾